
చక్ దే ఇండియా.. జయహో టీం ఇండియా.. నినాదాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం హోరెత్తింది

ప్రపంచ కప్–2023 భాగంగా భారత్–న్యూజిల్యాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు బిగ్ స్క్రీన్స్‌పై చూసి ఆనందించారు

ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద స్క్రీన్‌ను, క్రికెట్ అభిమానులు కూర్చొని మ్యాచ్ తిలకించేందుకు డిజే సౌండ్ సిస్టమ్‌తో సహా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది

దీంతో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. అలాగే పలు షాపింగ్ మాల్స్, హోటళ్లు, యాడ్ బోర్డులపైనా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు

మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించడంతో యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు























