వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో 12 ఏళ్ల వరల్డ్‌కప్ ట్రోఫి నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఓటమితో 140 కోట్ల భారతీయులకు గుండె కోతను మిగిల్చింది.
మరోవైపు ఈ ఫైనల్ పోరులో అద్బుత ప్రదర్శన ఆస్ట్రేలియా.. ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది.
కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగానే స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన బౌలింగ్‌లో మాక్స్‌వెల్ తన బౌలింగ్‌లో విన్నింగ్ షాట్ కొట్టగానే సిరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.
అంతకుముందు విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆసీస్ విజయానికి చేరువులో ఉన్నప్పుడు కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ టోర్నీ మొత్తం కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: CWC 2023: అన్నంత పనిచేసిన కమిన్స్.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు
Siraj & entire team crying they dint deserve this man💔#CWC23 #CWC23Final #INDvAUS
— ᴀꜱɪᴍ ʀɪᴀᴢ ᴜɴɪᴠᴇʀꜱᴇ 💛 (@AsimRiazworld) November 19, 2023
pic.twitter.com/avux5bct6H
— Sitaraman (@Sitaraman112971) November 19, 2023
Comments
Please login to add a commentAdd a comment