
వన్డే ప్రపంచకప్-2023 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66), రోహిత్ శర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4), రవీంద్ర జడేజా(9) తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్,కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు మాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ సాధించారు.
కోహ్లి షాకింగ్ రియాక్షన్..
కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఔటైన తర్వాత విరాట్ కోహ్లి.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే 54 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి.. ఊహించని రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 29 ఓవర్‌లో మూడో బంతిని కమ్మిన్స్ షర్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
ఈ క్రమంలో కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని సంప్ట్స్‌ను గిరాటేసింది. దీంతో విరాట్ కోహ్లి షాక్‌తో కాసేపు క్రీజులో అలా ఉండిపోయాడు. నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: