
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై ఘనవిజయం సాధించింది

ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది

ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది

తొలుత ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది






















