
ఇషాన్ కిషన్.. గత కొన్ని రోజులగా భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గతేడాది నవంబర్ నుంచి ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ మధ్యలోనే ఉన్నపళంగా స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి బీసీసీఐతో కానీ, భారత జట్టు మేనెజ్‌మెంట్‌తో కానీ టచ్‌లో లేడు. అయితే దక్షిణాఫ్రికా టూర్ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కిషన్ అందుబాటులో ఉంటాడని భావించారు.
కానీ తొలి రెండు టెస్టు ప్రకటించిన జట్టులో కిషన్ పేరు కన్పించలేదు. రెండో టెస్టు అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావాలంటే కిషన్ కచ్చితంగా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. కానీ కిషన్ రాహుల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోలేదు.
రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్ తో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగే అవకాశం ఉన్నా..కిషన్ విముఖత చూపించాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ కూడా పరోక్షంగా స్పందించినట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లు రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటంపై బోర్డు అగ్రహం వ్యక్తం చేసినట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కిషన్‌పై వేటు..
అయితే మరోక నివేదిక ప్రకారం.. కిషన్ వ్యవహరంపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిపై చర్యలకు బోర్డు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024-25 ఏడాదిగాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ క్రమంలో ఇషాన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమచారం.
ప్రస్తుతం గ్రేడ్ 'సి'లో ఉన్న ఇషాన్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వినికిడి. కాగా 2022-23లో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి కిషన్ దక్కించుకున్నాడు. బీసీసీఐ నుంచి రూ. కోటి రూపాయలు వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment