టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా అతడికి విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ లేమి కారణంగానే జట్టు నుంచి తప్పించారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అయితే వైజాగ్ టెస్టు అనంతరం తన గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి సాకుతో అయ్యర్ ఏన్సీఏలో చేరాడు. కాగా ఇటీవలే బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.
ఈ క్రమంలో రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్‌నెస్‌గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
బీసీసీఐ సీరియస్..
ఈ క్రమంలో బోర్డు అదేశాలను బేఖాతరు చేసిన ఆటగాళ్లపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సైతం దేశీవాళీ క్రికెట్ ఆడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రంజీలు ఆడితానే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఉంటుందని భారత హెడ్‌కోచ్ హెచ్చిరించినా కిషన్ మాత్రం పెడచెవిన పెట్టాడు.
ఈ క్రమంలో అయ్యర్, కిషన్‌పై చర్యలకు బోర్డు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024-25 ఏడాదిగాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమచారం. ప్రస్తుతం గ్రేడ్ 'బి'లో ఉన్న అయ్యర్, గ్రేడ్ 'సి' లో ఉన్న కిషన్ కాంట్రాక్ట్‌లను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వినికిడి.
"అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 2023-24 సీజన్‌కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపు ఖరారు చేసింది. ఈ జాబితాను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను కాంట్రాక్ట్‌ను తప్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి దేశవాళీ క్రికెట్ ఆడడం లేదని" బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా 2022-23లో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి కిషన్ దక్కించుకోగా.. అయ్యర్ బి గ్రేడ్‌కు ప్రమోషన్ పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment