
టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 25వ పుట్టినరోజు ఆదివారం ఘనంగా జరిగింది

స్నేహితులు, అత్యంత సన్నిహితుల నడుమ కేక్ కట్ చేశాడు గిల్

ఇందుకు సంబంధించిన ఫొటోలను మిజోరాం క్రికెటర్ అగ్నిదేవ్ చోప్రా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు

టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బర్త్‌డే బాయ్ గిల్‌తో కలిసి సందడి చేశారు

గిల్ పుట్టినరోజు సంబరాల్లో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

ఇటీవల శ్రీలంక పర్యటన సందర్భంగా టీమిండియా వన్డే, టీ20 వైస్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించింది బీసీసీఐ

ఇక దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. ఒకే ఒక మ్యాచ్ ఆడాడు

బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టు జట్టులో చోటు దక్కడంతో దులిప్ ట్రోఫీ టోర్నీ నుంచి విరామం తీసుకున్నాడు

