ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌పై టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పాకిస్తాన్ బౌలర్లకు ఈ జార్ఖండ్ డైనమేట్ చుక్కలు చూపించాడు.
5 స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 82 పరుగులు చేసి భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని కిషన్ నెలకొల్పాడు. కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ పట్ల సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన కిషన్..
ఇక 82 పరుగులతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 17 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా కిషన్ నిలిచాడు. ఇప్పటివరకు తన 17 ఇన్నింగ్స్‌లలో కిషన్ 776 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిను అధిగమించాడు. కోహ్లి 17 ఇన్నింగ్స్‌లు తర్వాత 757 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కిషన్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో శుబ్‌మన్ గిల్(778) అగ్ర స్ధానంలో ఉన్నాడు.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment