టీమిండియాకు వరుస షాక్‌లు.. మరో స్టార్‌ ఆటగాడికి గాయం! | Big blow for Team India, Ishan Kishanand Suryakumar Yadav doubtful for IND vs NZ | Sakshi
Sakshi News home page

IND vs NZ WC 2023: టీమిండియాకు వరుస షాక్‌లు.. మరో స్టార్‌ ఆటగాడికి గాయం!

Published Sat, Oct 21 2023 9:16 PM | Last Updated on Sat, Oct 21 2023 9:34 PM

Big blow for Team India, Ishan Kishanand Suryakumar Yadav doubtful for IND vs NZ - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా ఆక్టోబర్‌ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్‌ పాండ్యా కివీస్‌తో మ్యాచ్‌కు దూరంగా.. ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ కూడా గాయపడ్డారు. ధర్మశాలలోని హెచ్‌పీసీఎ స్టేడియంలో ప్రాక్టీసీ చేస్తుండగా ఇషాన్‌ కిషన్‌కు తేనెటీగ కుట్టింది.

నొప్పితో విల్లవిల్లాడిన కిషన్‌కు బీసీసీఐ వైద్య బృందం చికిత్స అందించింది. మరోవైపు నెట్‌ ప్రాక్టీస్‌లో స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మణికట్టుకు గాయమైంది. ప్రాక్టీస్‌ చేస్తుండగా బంతి సూర్య  కుడి చేతికి మణికట్టుకు బలంగా తాకినట్లు సమాచారం. వెంటనే మెడికల్‌ స్టాప్‌ ఐస్‌ ప్యాక్‌ను పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కివీస్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ రానున్నట్లు వార్తలు వినిపించాయి. అంతలోనే సూర్యకు గాయం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. అదేవిధంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే జడ్డూ గాయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో టీమిండియా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక హార్దిక్‌ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో మరో 24 గంటలు వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement