ఇషాన్ కిషన్ (PC: BCCI)
Asia Cup 2023- India Vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ పూర్తిగా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ లెఫ్టాండర్.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంక వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతోంది. పల్లెకెలెలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుబ్‌మన్ గిల్(10).. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(4) పూర్తిగా విఫలమయ్యారు.
అయ్యర్‌కు చేదు అనుభవం
నాలుగో నంబర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కేవలం 14 పరుగులకే పరిమితమై పునరాగమనంలో చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో కలిసి వైస్ కెప్టెన్ పాండ్యా జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నాడు.
ఆదుకున్న ఇషాన్, పాండ్యా
జార్ఖండ్ బ్యాటర్ ఇషాన్ 81 బంతుల్లో 82 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న వేళ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజం చేతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌గా ఇషాన్ వెనుదిరిగాడు.
అజారుద్దీన్‌తో పాటు ఆ లిస్టులో ఇషాన్
అయితే, పాక్‌తో మ్యాచ్ సందర్భంగా అర్ధ శతకంతో మెరిసిన ఇషాన్ కిషన్... అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వరుసగా అతడికిది నాలుగో హాఫ్ సెంచరీ(ఓవరాల్‌గా ఏడో ఫిఫ్టీ). దీంతో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు ఇషాన్ కిషన్.
వన్డేల్లో వరుసగా నాలుగు అర్ధ శతకాలు బాదిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో చేరాడు. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, శ్రేయస్ అయ్యర్, సురేశ్ రైనా, మహ్మద్ అజారుద్దీన్ తదితరులు కూడా ఈ ఘనత సాధించారు.
చదవండి: Ind Vs Pak: నంబర్1 జట్టుతో ఢీ.. రాత్రంతా నిద్రపట్టనేలేదు
Comments
Please login to add a commentAdd a comment