
ఆస్ట్రేలియా గడ్డపై జరిగే రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇద్దరు ఆంధ్ర ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్‌లకు ఇందులో చోటు లభించింది.
భారత సీనియర్ టీమ్‌లో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో అవకాశం దక్కడం విశేషం. ఈ టూర్‌లో భాగంగా ఆ్రస్టేలియా ‘ఎ’తో మెకే, మెల్‌బోర్న్‌లలో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడుతుంది.
ఆ తర్వాత టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న భారత సీనియర్ టీమ్‌తో పెర్త్‌లో మూడు రోజుల మ్యాచ్‌లో కూడా తలపడుతుంది. ‘ఎ’ జట్టు ప్రదర్శన ద్వారా కూడా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం కూడా ఒకరిద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.
భారత ‘ఎ’ జట్టు వివరాలు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయిసుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పొరేల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాళ్, నవదీప్ సైనీ, మానవ్ సుథార్, తనుశ్ కొటియాన్.
చదవండి: అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment