Shreyas Iyer Singing Song At Shardul Thakur Pre Wedding Function Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: శార్దూల్‌ ఠాకూర్‌ ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ రచ్చ

Published Mon, Feb 27 2023 1:31 PM | Last Updated on Mon, Feb 27 2023 3:03 PM

Shreyas Iyer Sing A Song At Shardul Thakur Pre Wedding Function Goes Viral - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఇవాళ (ఫిబ్రవరి 27) ముంబైలో తన ఫియాన్సీ మిథాలీ పరుల్కర్‌ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. పెళ్లి ఇవాళే అయినప్పటికీ కొద్ది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. మెహందీ ఫంక్షన్‌లో శార్దూల్‌ ఓ కర్రాడితో కలిసి మాస్‌ డ్యాన్స్‌ చేసిన వీడియోలు ఇప్పటికీ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తాజాగా శార్దూల్‌ ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

ఈ వీడియోలో టీమిండియా స్టార్‌ ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారధి శ్రేయస్‌ అయ్యర్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. గత కొన్ని రోజులుగా ఏదో ఒక వీడియోతో సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న అయ్యర్‌.. ఈ వీడియోలోనూ తన స్టయిల్‌లో హంగామా చేశాడు. కేకేఆర్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడు అభిషేక్‌ నాయర్‌తో కలిసి శార్దూల్‌-మిథాలీ ప్రీవెడ్డింగ్‌ ఫంక్షన్‌కు హాజరైన అయ్యర్‌.. బ్రహ్మాస్త్ర సినిమాలోని పాపులర్‌ 'కేసరియా' పాటను పాడాడు. సింగర్‌తో పాటు శ్రేయస్‌, నాయర్‌లు పాట పాడుతుండగా.. కాబోయే భార్య మిథాలీతో కలిసి శార్దూల్‌ కొన్ని రొమాంటిక్‌ స్టెప్పులేశాడు.

అనంతరం శార్దూల్‌ స్టేజ్‌పైకి ఎక్కి కేకేఆర్‌ సహచరులతో పాటు కొన్ని లైన్లు పాట కూడా పాడాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇందుకు క్యాప్షన్‌గా పలు ఆసక్తికర కామెంట్స్‌ను కూడా జోడించింది. ఒక్క విషయం చెప్పండి.. కేకేఆర్‌ బాయ్స్‌పై ఎవరైనా ఎలా మనసు పారేసుకోలేరు అంటూ కామెంట్స్‌ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం​ సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన 3 గంటల్లోనే ఈ వీడియోకు రికార్డు స్థాయిలో 65000 లైకుల వచ్చాయి.

కాగా, శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఇద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రేయస్‌.. కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. శార్దూల్‌ను ఇటీవలే కేకేఆర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి ట్రేడింగ్‌ చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ ముగిసాక జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రేయస్‌-శార్దూల్‌ కలిసి పాల్గొంటారు. అనంతరం ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున వీరి జర్నీ ప్రారంభమవుతుంది. శ్రేయస్‌, శార్దూల్‌ ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారే కావండతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ బలపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement