Team India's Lord Shardul Thakur Marriage in 2 Days - Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో భారత స్టార్‌ క్రికెటర్‌ పెళ్లి.. డ్యాన్స్‌ అదిరిపోయిందిగా! వీడియో వైరల్‌

Published Sat, Feb 25 2023 7:09 PM | Last Updated on Sat, Feb 25 2023 8:49 PM

Team Indias LORD Shardul Thakur marriage in 2 days - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి మితాలీ పారుల్కర్ ఫిబ్రవరి 27న (సోమవారం) శార్దూల్ మనువాడనున్నాడు. ముంబైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనుంది. వీరిద్దరి వివాహానికి 250 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో జరగబోయే వీరి పెళ్లి సందడి ఇప్పటికే ప్రారంభమైంది.

హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ముగిశాయి. హల్దీ వేడుకలో శార్దూల్ డ్యాన్స్‌ ఇరగదీశాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  కాగా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో పెళ్లికూతురు మిథాలీ స్వయంగా వారిద్దరి పెళ్లి గురించి ప్రస్తావించింది.  2021 నవంబర్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి వివాహం టీ20 ప్రపంచకప్‌-2022 అనంతరం జరగాల్సింది.

కానీ వివిధ కారణల వలన వాయిదా పడింది.  ఇక ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్‌ వివాహం కాగా..అక్షర్ పటేల్ తన స్నేహితురాలు మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్నాడు.


చదవండి: Dinesh Karthik: 'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్‌లో అదరగొడతాడు'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement