సెంచరీ సాధించిన శార్దూల్‌ ఠాకూర్‌.. మొట్టమొదటిది | Ranji Trophy 2024 MUM VS TN 2nd Semi Final: Shardul Thakur Scored Hundred, First Ever By Him In Ranji - Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: సెంచరీ సాధించిన శార్దూల్‌ ఠాకూర్‌.. మొట్టమొదటిది

Published Sun, Mar 3 2024 4:26 PM | Last Updated on Sun, Mar 3 2024 6:18 PM

Ranji Trophy 2024 MUM VS TN 2nd Semi Final: Shardul Thakur Scored Hundred, First Ever By Him In Ranji - Sakshi

ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సెంచరీతో (109) మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. జట్టు కష్టాల్లో (106/7) ఉన్నప్పుడు బరిలోకి దిగిన శార్దూల్‌.. బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని అతను కేవలం 89 బంతుల్లోనే సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రంజీల్లో శార్దూల్‌కు ఇది మొదటి సెంచరీ.

శార్దూల్‌ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. 88 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి, 157 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తనుశ్‌ కోటియన్‌ (40), తుషార్‌ దేశ్‌పాండే క్రీజ్‌లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో ముషీర్‌ ఖాన్‌ (55) అర్ద సెంచరీతో రాణించగా.. హార్దిక్‌ తామోర్‌ (35) పర్వాలేదనిపించాడు. సాయికిషోర్‌ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. కుల్దీప్‌ సేన్‌ 2, సందీప్‌ వారియర్‌ ఓ వికెట్‌ దక్కించకున్నారు. 

దీనికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. తుషార్‌ దేశ్‌ పాండే 3, ముషీర్‌ ఖాన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, తనుశ్‌ కోటియన్‌ తలో 2 వికెట్లు, మోహిత​్‌ అవస్థి ఓ వికెట్‌ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్‌ శంకర్‌ (44), వాషింగ్టన్‌ సుందర్‌ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement