కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం తమ సొంత గడ్డపై మరోసారి భారత్‌ను చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తోంది.
ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కేప్‌టౌన్‌కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. ఇక తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో టెస్టుకు భారత తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది.
జడ్డూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా అశ్విన్ ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు.
అశ్విన్‌ను రెండో టెస్టులో కూడా కొనసాగించాలి. శార్దూల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్ అని నేను భావిస్తున్నాను. జడేజా ఫిట్‌నెస్ సాధించినప్పటికీ శార్దూల్ స్థానంలో అశ్విన్‌ను ఆడించాలి. అశ్విన్ ఐదు వికెట్ల హాల్స్ సాధించికపోయినప్పటికీ.. ఒకట్రెండు వికెట్లైనా తీయగలడు. అతడు జడేజాతో కలిసి ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.
వీరిద్దరూ కలిసి నాలుగు-ఐదు వికెట్ల తీయగలరు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్పిన్నర్లే కీలకం. భారత్ గట్టిగా ప్రయత్నిస్తే అక్కడ కూడా సఫారీలను ఓడించవచ్చు. కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడిన పేసర్ ప్రసిద్ద్ కృష్ణను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదు. కాబట్టి తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శార్ధూల్‌పై వేటు వేయడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.
చదవండి: Aus Vs Pak 3rd Test: వార్నర్ ఫేర్‌వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment