Kris Srikkanth
-
సిరాజ్.. నీకు అసలు బుద్ది ఉందా..?
అడిలైడ్ టెస్ట్ సందర్భంగా టీమిండియా పేసర్ మొహహ్మద్ సిరాజ్- ఆసీస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మధ్య జరిగిన ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్‌ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్‌కు ఓ డీ మెరిట్ పాయింట్ ఇవ్వగా.. సిరాజ్‌కు డీ మెరిట్ పాయింట్‌తో పాటు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.సిరాజ్-హెడ్ గొడవపై సోషల్‌మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడు. హెడ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్‌ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.హెడ్ పట్ల సిరాజ్‌ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఇలా అన్నాడు.హే సిరాజ్.. హెడ్ నీ బౌలింగ్‌ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్ ఆఫ్ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.హెడ్‌ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్ సిరాజ్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.శ్రీకాంత్ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్ ఆఫ్ ఇస్తావా..? నువ్వు హెడ్‌ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్ చేసి ఉంటే అది వేరే విషయం. నువ్వు ఏదో ప్లాన్ చేసి అతని వికెట్ తీసినట్లు సంబురపడిపోయావు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్ దగ్గర సమాధానం లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్ అసలు స్పిన్నర్‌గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు" -
‘కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ స్పృహతప్పడం ఖాయం’
విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ.. దశాబ్దకాలంగా భారత క్రికెట్ ముఖచిత్రంగా నీరాజనాలు అందుకుంటున్న స్టార్ బ్యాటర్లు. టీమిండియా తరఫున ఎన్నో రికార్డులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఇటీవలే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించారు.వరల్డ్‌కప్-2027 వరకు జట్టులోఈ నేపథ్యంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్- బ్యాటర్ కోహ్లి భవితవ్యం గురించి చర్చలు తెరమీదకు రాగా.. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడతామని ఇద్దరూ స్పష్టం చేశారు. టీమిండియా కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం రోహిత్- కోహ్లి ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్‌కప్-2027 వరకు జట్టులో కొనసాగుతారని పేర్కొన్నాడు.అయితే, అదేమీ అంత తేలికకాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్. వచ్చే వరల్డ్‌కప్ ఈవెంట్లో కోహ్లి ఆడగలిగినా.. రోహిత్ ఆడటం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. ‘విరాహిత్’ విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన చిక్కా..కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ స్పృహతప్పడం ఖాయం‘‘రోహిత్ గొప్ప ఆటగాడు. అయితే, ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు. వచ్చే వన్డే వరల్డ్‌కప్ నాటికి ఇంకో మూడేళ్లు పెరుగుతుంది. అంటే.. 40 ఏళ్లు. ఈ ఏజ్‌లో ఓ క్రికెటర్ వరల్డ్‌కప్ ఆడలేడు. అయితే, విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు భిన్నం.అతడికి 2027 వరల్డ్‌కప్ వరకు ఆడగల సత్తా ఉంది.అయితే, రోహిత్ మాత్రం అప్పటిదాకా కొనసాగలేడని కచ్చితంగా చెప్పగలను. అతడి విషయంలో మిస్టర్ గంభీర్ కాస్త ఎక్కువే ఊహించుకుంటున్నాడు. నిజానికి రోహిత్‌ను సౌతాఫ్రికా తీసుకువెళ్తే అతడు అక్కడ బ్యాటింగ్ చేయలేక స్పృహతప్పిపోవడం ఖాయం’’ అని పేర్కొన్నాడు. 35 ఏళ్ల కోహ్లి మాత్రం అక్కడ కూడా రాణించగలడని శ్రీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లి.. ఫిట్‌గా లేని కారణంగా ఇంత వరకు ఒక్కసారి కూడా జట్టుకు దూరం కాలేదు. అయితే, రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ నేపథ్యంలోనే క్రిష్ణమాచారి శ్రీకాంత్ పైవిధంగా స్పందించినట్లు చెప్పవచ్చు.ఇక 2027 వరల్డ్‌కప్ టోర్నీకి సౌతాఫ్రికా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. అక్కడ మూడు టీ20 ,మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది.చదవండి: అందుకే హెడ్‌కోచ్ పదవికి అప్లై చేయలేదు.. హార్దిక్ విషయంలో..: నెహ్రా -
T20 WC: టీమిండియా గెలవాలంటే అతడు జట్టులో ఉండాల్సిందే!
విరాట్ కోహ్లి గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. పనీపాటా లేని వాళ్లే వదంతులు సృష్టించి జనాల మీదకు వదులుతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు కోహ్లి లేని ప్రపంచకప్ జట్టును ఊహించడం కూడా కష్టమన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో కోహ్లికి చోటు ఇవ్వకుండా.. యువకులకు పెద్దపీట వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లి బ్యాటింగ్ స్టైల్ వెస్టిండీస్ పిచ్‌లకు అంతగా సూట్ కాదని.. అందుకే ఈ ఢిల్లీ బ్యాటర్‌ను తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. టీమిండియా గెలవాలంటే అతడు ఉండాల్సిందే ఈ విషయంపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి లేకుండా టీ20 ప్రపంచకప్ టీమా? ఛాన్సే లేదు. 2022లో జట్టును సెమీస్‌కు చేర్చిన ఘనత తనది. ఆ ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా అతడే. అలాంటి వ్యక్తికి జట్టులో చోటు ఉండదా? అసలు ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు? వాళ్లకు వేరే పనులేమీ లేవా? నిరాధారపూరిత వ్యాఖ్యలతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? ఒకవేళ ఈసారి టీమిండియా గనుక టీ20 వరల్డ్‌కప్ గెలవాలంటే విరాట్ కోహ్లి కచ్చితంగా జట్టులో ఉండి తీరాల్సిందే’’ అని చిక్కా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా స్పందించాడు. సచిన్ మాదిరే కోహ్లికి కూడా ఆ గౌరవం దక్కాలి ఈ మేరకు.. ‘‘వన్డే వరల్డ్‌కప్ లేదంటే టీ20 ప్రపంచకప్.. ఈవెంట్ ఏదైనా.. జట్టును ఒడ్డుకు చేర్చే ఆటగాడు ఉండాల్సిందే. విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు కేవలం జట్టులో ఉంటే చాలు. అన్నీ సజావుగా సాగిపోతాయి. వందకు వంద శాతం జట్టుకు కోహ్లి అవసరం ఉంది. కోహ్లి కోసం టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్ ట్రోఫీ గెలవాలి. 2011లో సచిన్ టెండుల్కర్‌కు దక్కిన మాదిరే విరాట్ కోహ్లికి కూడా గౌరవం దక్కాలి. అతడికి జట్టు ఇచ్చే గొప్ప కానుక అంతకంటే మరొకటి ఉండదు’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
IND Vs SA: 'దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. అతడి కంటే అశ్విన్‌ను తీసుకోవడమే బెటర్'
కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం తమ సొంత గడ్డపై మరోసారి భారత్‌ను చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కేప్‌టౌన్‌కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో టెస్టుకు భారత తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. జడ్డూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా అశ్విన్ ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు. అశ్విన్‌ను రెండో టెస్టులో కూడా కొనసాగించాలి. శార్దూల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్ అని నేను భావిస్తున్నాను. జడేజా ఫిట్నెస్ సాధించినప్పటికీ శార్దూల్ స్థానంలో అశ్విన్‌ను ఆడించాలి. అశ్విన్ ఐదు వికెట్ల హాల్స్ సాధించికపోయినప్పటికీ.. ఒకట్రెండు వికెట్లైనా తీయగలడు. అతడు జడేజాతో కలిసి ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. వీరిద్దరూ కలిసి నాలుగు-ఐదు వికెట్ల తీయగలరు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్పిన్నర్లే కీలకం. భారత్ గట్టిగా ప్రయత్నిస్తే అక్కడ కూడా సఫారీలను ఓడించవచ్చు. కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడిన పేసర్ ప్రసిద్ద్ కృష్ణను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదు. కాబట్టి తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శార్ధూల్‌పై వేటు వేయడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: Aus Vs Pak 3rd Test: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన -
WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం!
World Cup 2023: ఆసియా కప్-2023 ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్‌కు సిద్ధం కానుంది. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 8న ఆసీస్‌తో తలపడనుంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగనున్న తరుణంలో ప్రపంచకప్‌లోనూ ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వన్డే వరల్డ్‌కప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించాడు. చహల్‌కు అవకాశమిచ్చిన చిక్కా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు అవకాశమిచ్చిన చిక్కా.. అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయి చూపాడు. అదే సమయంలో.. వన్డేల్లో అంతంత మాత్రంగానే ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు తన జట్టులో చోటివ్వడం విశేషం. రాహుల్‌ను వద్దని ఇప్పుడిలా అంతేకాదు.. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించని కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్-2023కి ఎందుకు ఎంపిక చేశారన్న శ్రీకాంత్.. తన వరల్డ్‌కప్ జట్టులో మాత్రం అతడిని ఎంపిక చేయడం గమనార్హం. కాగా టీమిండియా మిడిలార్డర్ స్టార్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శస్త్ర చికిత్స అనంతరం ఇద్దరూ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందారు. ఇందులో భాగంగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన అయ్యర్, రాహుల్.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. పూర్తిగా కోలుకుని ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించారు. అయితే, రాహుల్‌ను గాయం వెంటాడుతోందని.. అతడు పాకిస్తాన్(సెప్టెంబరు 2)తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా వెల్లడించాడు. దీంతో అతడిని సెలక్ట్ చేసి తప్పు చేశారంటూ ఫైర్ అయ్యాడు చిక్కా. తిలక్, ప్రసిద్‌కు నో ఛాన్స్ ఇక అయ్యర్‌తో పాటు ఆసియా కప్ ఆడే అవకాశం దక్కించుకున్న హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ సహా ప్రసిద్ కృష్ణకు 1983 విన్నర్ శ్రీకాంత్ తన జట్టులో చోటివ్వలేదు. కాగా క్రిష్ణమాచారి చీఫ్ సెలక్టర్‌గా ఉన్న సమయంలో(2011)నే టీమిండియా రెండోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023కి క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్. చదవండి: నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం.. -
ఫిట్‌గా లేనప్పుడు ఎందుకు సెలక్ట్ చేశారు? వేరే వాళ్లని బలిచేసి..
'What is all this? Don't Select Him?: ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేనప్పుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుకని టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు. ఫిట్నెస్ లేని ఆటగాడి కోసం మిగతా వాళ్లను బలి చేయడం సరికాదంటూ మండిపడ్డాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ స్వయంగా చెప్పాడు ఈ క్రమంలో బీసీసీఐ.. సోమవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు సుదీర్ఘకాలం పాటు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెగా టోర్నీతో పునరాగమనం చేయనున్నట్లు వెల్లడించాడు. ఫిట్‌గా లేనివాడిని ఎందుకు ఎంపిక చేయడం? అయ్యర్ వంద శాతం ఫిట్నెస్ సాధించాడని.. రాహుల్‌ను గాయం వెంటాడుతోందని అగార్కర్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, ఈ వన్డే ఈవెంట్లో రెండు లేదంటే మూడో మ్యాచ్ నుంచి అతడు అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్ విన్నర్ శ్రీకాంతాచారి తన యూట్యూబ్ చానెల్ వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. అసలేంటి ఇదంతా? ‘‘కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేడని వాళ్లే చెప్పారు. ఒకవేళ ఆటగాడికి గాయం తాలుకు నొప్పి ఉంటే అతడిని సెలక్ట్ చేయొద్దు. సెలక్షన్ సమయంలో పూర్తి ఫిట్‌గా లేడని తెలిసినపుడు అతడిని ఎంపిక చేయొద్దనేది మన పాలసీ కదా! సెలక్షన్ నాటికి ఫిట్‌గా లేనివాడికి అవకాశం ఇవ్వడం దేనికి? ఒకవేళ వరల్డ్‌కప్ నాటికి అతడిని సిద్ధం చేయాలనుకుంటే.. అప్పుడే సెలక్ట్ చేయండి. అది వేరే విషయం. అంతేగానే ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఆడడు కానీ.. అతడిని సెలక్ట్ చేశాం. సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశాం అనడం.. అసలేంటి ఇదంతా? ఇలా చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’’ అంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేశాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ చిక్కా చురకలు అంటించాడు. ఆసియా వన్డే కప్-2023 బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. -
ODI WC 2023: 2011లో యువరాజ్ ఏం చేశాడో ఈ ఆటగాడు అదే చేస్తాడు..!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత విజయాల్లో జడ్డూ కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ ఏం చేశాడో (362 పరగులు, 15 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్), 2023 వరల్డ్‌కప్‌లో జడేజా కూడా అదే చేస్తాడని జోస్యం చెప్పాడు. జడ్డూతో పాటు మరో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడ సత్తా చాటే అవకాశముందని తెలిపాడు. ఫార్మాట్లకతీతంగా జడేజా ఇటీవలికాలంలో తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను గెలిపించిన వైనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. భారత్ చివరిసారిగా గెలిచిన ఐసీసీ ట్రోఫీలోనూ (ఛాంపియన్స్ ట్రోఫీ 2013) జడేజా పాత్రనే కీలకమని గర్తు చేశాడు. ప్రముఖ దినపత్రిక ఇండియాటుడేతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, జడేజా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (25 బంతుల్లో 33 నాటౌట్, 2/24) అదరగొట్టి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో జడ్డూ హైయ్యెస్ట్ వికెట్టేకర్గానూ (12 వికెట్లు) నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో రవీంద్ర జడేజా భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అతను.. ఐపీఎల్-2023లో సీఎస్కేను గెలిపించడంతో పాటు టీమిండియా విజయాల్లోనూ ప్రధానపాత్ర పోషించాడు. గాయం నుంచి కోలుకుని గతేడాది క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్ని ఫార్మాట్లలో జడేజా జోరు కొనసాగుతుంది. కెరీర్లో ఇప్పటివరకు 174 వవ్డేలు ఆడిన జడ్డూ.. 13 అర్ధశతకాల సాయంతో 32.80 సగటున 2526 పరుగులు చేశాడు. అలాగే 37.39 యావరేజ్‌తో 191 వికెట్లు పడగొట్టాడు. -
రోహిత్ శర్మ కాదు 'నో హిట్ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..!
ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేతో నిన్నటి మ్యాచ్‌లో (మే 6) రోహిత్ శర్మ డకౌట్ అయిన వెంటనే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న శ్రీకాంత్ స్పందిస్తూ.. రోహిత్ శర్మ తన పేరును 'నో హిట్ శర్మ'గా మార్చుకోవాలని సూచించాడు. రోహిత్ శర్మను అందరూ హిట్‌మ్యాన్ అని పిలుచుకునే నేపథ్యంలో శ్రీకాంత్ ఈ కామెంట్ చేశాడు. ఇంతటితో ఆగని శ్రీకాంత్.. నేనైతే రోహిత్ శర్మను జట్టులోకి కూడా తీసుకోనని హిట్‌మ్యాన్‌ను అవమానించేలా వ్యాఖ్యానించాడు. శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ను అవమానించే అర్హత నీకు లేదంటూ ఘాటుగా బదులిస్తున్నారు. హిట్‌మ్యాన్ అభిమానులు శ్రీకాంత్‌పై దుమ్మెత్తిపోస్తున్న కామెంట్లతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. వాస్తవానికి ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనాడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో డకౌట్ కావడంతో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా (16) రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో సునీల్ నరైన్ (15), మన్దీప్ సింగ్ (15), దినేశ్ కార్తీక్ (15) వరుస స్థానాల్లో ఉన్నారు. అంతకుముందు ముందు పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన రోహిత్.. మరో చెత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గా (11) అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్.. గౌతమ్ గంభీర్‌తో సమానంగా 10 సందర్భాల్లో డకౌటైన కెప్టెన్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సీఎస్కే బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మతీష పతిరణ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. దీపక్ చాహర్, తుషార్ తలో 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రుతురాజ్ (30), కాన్వే (44), రహానే (21), దూబే (26 నాటౌట్) రాణించడంతో సీఎస్కే సునాయాస విజయం సాధించింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2, ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై విమర్శల తాకిడి మొదలైంది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘోరంగా ఓడిపోవడంపై అటు అభిమానులు, ఇటు మాజీలు ధోనిపై మండిపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇంకా సీఎస్కే గాడిలో పెట్టలేకపోయిన ధోనిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధ్వజమెత్తాడు. ప్రధానంగా యువ క్రికెటర్లు స్పార్క్ లేదని ధోని చేసిన కామెంట్లపై శ్రీకాంత్ విమర్శనాస్త్రాలతో కూడిన ప్రశ్నలు సంధించాడు. ‘ నేను ధోని చెబుతున్న దానితో ఏకీభవించను. ధోని కేవలం మాటల్లో భాగంగానే అలా మాట్లాడాడు. కానీ నేను మాత్రం అంగీకరించను. అసలు సెలక్షన్ ప్రక్రియే దారుణంగా ఉంది. ముందు సీఎస్కే సెలక్షన్‌పై దృష్టి పెట్టంది. జగదీశన్ లాంటి యువ క్రికెటర్‌ను ఎందుకు పక్కన పెట్టారు. ఒక గేమ్‌లో అవకాశం ఇస్తే 30కి పైగా పరుగులు చేసి ఆకట్టుకున్నాడు కదా.. ముందు మీరు అవకాశాలు ఇస్తే కదా వారి సత్తా తెలిసేది. (రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..? ) ఈ సీజన్లో మీ ఆటలో మెరుపు ఉందా.. కేదార్ జాదవ్ ఆటలో మెరుపు ఉందా.. పీయూష్ చావ్లా ఆటలో మెరుపు ఉందా.. ఎక్కడ ఉంది సీఎస్కేలో మెరుపు. ధోని చెప్పిన ఏ ఒక్క సమాధానాన్ని కూడా నేను ఈరోజు అంగీకరించను. ఇక సీఎస్కే కథ ముగిసినట్లే’ అని శ్రీకాంత్ విమర్శించాడు. కరణ్ శర్మ మంచి వికెట్లు తీసి బ్రేక్ ఇస్తుంటే పీయూష్ చావ్లాను వేసుకున్నారు. ధోని ఒక గొప్ప క్రికెటర్. అందులో సందేహం లేదు. బంతిపై పట్టు దొరకడం లేదనే సమాధానం నాకు నచ్చలేదు. సరైనది కూడా కాదు. మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు కానీ మీలో పూర్తి పసలేదు. చివరకు ఈ సీజన్లో ధోని కూడా తేలిపోయాడు. సీఎస్కే జట్టులో ఎవరూ ఆటడం లేదు. అదే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రతీ ఒక్కర్నీ నిందించాలి. ఒకసారి ముంబై జట్టును చూడండి. సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడుతున్నాడో చూడండి. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఎలా గుర్తించింది. అతను ఎటాక్ ఎలా ఉందో చూస్తున్నాం కదా. ప్రస్తుతం వరల్డ్‌లో హార్దిక్ ఒక నంబర్ వన్ ఆల్‌రౌండర్. ఆటగాళ్లను గుర్తించే పనిలో ఉండండి. యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వండి. ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తుంది. ఇషాన్ కిషన్ కూడా అలాగే సత్తాచాటిన క్రికెటర్. ఒక కెప్టెన్‌గా సరైన ప్రకటనలు ఇవ్వండి. ఏ కెప్టెన్ కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడు. జగదీశన్ ఒక మ్యాచ్ ఆడి 30 పరుగులు చేస్తే ఎందుకు మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. గతంలో సీఎస్కే జట్టులో ఉన్న బాబా అపరాజిత్ అనే క్రికెటర్ కూడా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకుండానే వెళ్లిపోయాడు. దేశవాళీలో మంచి రికార్డు ఉన్న అపరాజిత్‌కు అప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఇకనైనా యువ క్రికెటర్లను ఆడించండి’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు శ్రీకాంత్. -
‘అతని వల్లే సచిన్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్. సచిన్ పేరిట ఇప్పటికీ పలు రికార్డులు పదిలంగా ఉన్నాయంటే అతని క్రికెట్‌ను ఎంతగానో ఆస్వాదించాడో తెలుస్తోంది. తాను ఓపెనర్‌గా దిగుతానని బ్రతిమాలుకున్న సందర్భాలే కాకుండా ఆ స్థానానికి సచిన్ ఎంతగా వన్నె తెచ్చాడో క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. కాగా, సచిన వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఒక మాజీ కెప్టెన్ ప్రోత్సాహం ఉందట. అతను ఎవరో కాదు అగ్రెసివ్ బ్యాట్స్‌మన్‌గా మన్ననలు అందుకున్న కృష్ణమాచారి శ్రీకాంత్. సచిన్ ఎదగడంలో శ్రీకాంత్ పాత్ర మరువలేనిదని మాజీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్ తాజాగా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన తమిళ క్రికెట్ కనెక్టెడ్ షోలో శివరామకృష్ణన్ పలు విషయాల్ని పంచుకున్నాడు. (అవన్నీ పొరపాట్లే, చింతిస్తున్నా: స్టీవ్ బక్నర్) ‘చీకా(కృష్ణమాచారి శ్రీకాంత్) అగ్రెసివ్ బ్యాట్స్‌మనే కాదు.. అగ్రెసివ్ కెప్టెన్ కూడా. ఫలితాలు సాధించడం ద్వారానే చీకా ఏమిటో నిరూపించుకున్నాడు. అతను చాలా చురకైన వాడు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు చీకా కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. సచిన్‌ను చీకా బాగా ప్రోత్సహించాడు. చీకా ఇచ్చిన సహకారంతోనే అప్పుడు యుక్త వయసులో ఉన్న సచిన్‌లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అది అతన్ని వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. మనం చాలా మంది స్ఫూర్తిదాయకమైన కెప్టెన్లను చూశాం. అందులో చీకా ఒకడు. అతను సుదీర్ఘ కాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా చేస్తాడనుకున్నా అది జరగలేదు. నాకు చీకా కెప్టెన్సీ అంటే ఇష్టం. చాలా తక్కువ సమయం మాత్రమే చీకా కెప్టెన్‌గా ఉండటం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది’ అని శివరామకృష్ణన్ తెలిపాడు. కేవలం 4 టెస్టులు, 13 వన్డేలకు మాత్రమే కృష్ణమాచారి శ్రీకాంత్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతిని శివరామకృష్ణన్ పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక తన కెరీర్ కూడా తొందరగా ముగిసిపోవడంపై శివరామకృష్ణన్ పెదవి విప్పాడు. తనకు అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నాడు. గావస్కర్ మార్గనిర్దేశంలో గైడెన్స్ తనకు ఎంతగానో ఉపయోగిపడిందన్నాడు. భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టులు, 16 వన్డేలను మాత్రమే ఆడాడు. -
అఫ్గాన్‌కు ఎక్కువ సీన్ ఇచ్చారు: మాజీ క్రికెటర్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. అఫ్గాన్‌ను బౌలర్లకు ఎక్కువ సీన్ ఇవ్వడంతోనే భారత జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైందంటూ ఎద్దేవా చేశాడు. అఫ్గాన్ బౌలర్లు మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్‌ఖాన్ కట్టుదిట్టంగా బంతులేసినా.. భారత్‌ను మరీ 225 పరుగులలోపే కట్టడి చేసేంత ప్రదర్శన కాదని అన్నాడు. పిచ్ సహకరించకలేదని చెప్పుతూనే మధ్య ఓవర్లలో భారత్ బ్యాటింగ్ మరీ నెమ్మదించడం ఆలోచించాల్సిన విషయమన్నాడు. స్వేచ్ఛగా షాట్లు ఆడటంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబాటుకు లోనైందన్న విషయం అంగీకరించాలన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతంగా వ్యవహరించాడని అతని కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. అఫ్గాన్ ఆఖరి వరకూ పోరాడినా టీమిండియా గెలవడం సంతోషాన్నిచ్చిందన్నాడు. -
‘ఆ క్రెడిట్ మొత్తం జోస్ బట్లర్‌దే కాదు’
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్‌పై ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబైతో కీలకమైన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌తో పాటు జోఫ్రా ఆర్చర్ రాణించడం వల్లే రాజస్తాన్ విజయం సాధ్యమైందని అంటున్నాడు భారత దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఆ క్రెడిట్ మొత్తం బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఇవ్వడం సరైనది కాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ విజయంలో ఇద్దరికీ సమాన క్రెడిట్ ఇస్తేనే బాగుంటందన్నాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ వేసిన విషయాన్ని శ్రీకాంత్ గుర్తు చేశాడు. ఆర్చర్ తన కోటా నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా 14 డాట్ బాల్స్ వేసి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడన్నాడు. ‘బౌలర్లు వేగంగా బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తుంటే అది క్రికెట్లో ఆహ్లాదకర దృశ్యమే. అయితే ఐపీఎల్లో బౌలర్లకు అంత అదృష్టం లేదు. వారి కృషికి తగిన గుర్తింపు లభించడంలేదు. జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్ ఎంత కష్టపడినా ప్రశంసలన్నీ బ్యాట్స్‌మెన్‌కే దక్కుతున్నాయి. ఆర్చర్, బట్లర్‌లే రాజస్థాన్ జట్టు బలం. ఆర్చర్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తుంటే, బట్లర్ పరుగులతో జట్టును గెలిపిస్తున్నాడు. కేవలం బట్లర్‌కే క్రెడిట్ ఇవ్వడం తగదు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి కృషి వల్లే రాజస్తాన్ గెలిచింది’ అని శ్రీకాంత్ తెలిపాడు. -
'విరాట్ కోహ్లీది సెపరేట్ స్టైల్'
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు .ప్రపంచ క్రికెటర్లలో విరాట్ ఒక సెపరేట్ స్టైల్‌తో దూసుకుపోతూ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నాడని కొనియాడాడు. అతని ప్రత్యేక శైలే విరాట్ ను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఏ దశలోనైనా అతను పోరాడి తీరు నిజంగా అద్భుతమన్నాడు. 'విరాట్ ఏ బౌలర్‌ను క్షమించే నైజం కాదు. అతను క్రీజ్‌లో ఉన్నాడంటే గెలుపుకోసమే శ్రమిస్తాడు. పరిస్థితులను అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రతిభ విరాట్ కు పుష్కలంగా ఉంది. ఏనాటికైనా ప్రపంచ బెస్ట్ కెప్టెన్లలో విరాట్ ఒకడిగా నిలుస్తాడు' అని బీసీసీఐ మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ అభినందించాడు. దీంతోపాటు భారత్ క్రికెట్ జట్టుకు 1983లో తొలి వరల్డ్ కప్ అందించిన ఆనాటి కెప్టెన్ కపిల్‌దేవ్‌ను శ్రీకాంత్ కొనియాడాడు. కపిల్ దేవ్ది ఎప్పుడూ సానుకూల ధోరణితో ముందుకువెళ్లేవాడన్నాడు. కపిల్ దేవ్ తనకంటూ భిన్నమైన శైలిని సృష్టించుకుని బౌలింగ్‌లో రాణించేవాడన్నాడు. అవతలి బ్యాట్స్‌మెన్ ఎవరు అనే దానిపై కపిల్‌దేవ్ బాగా కసరత్తు చేసి విజయవంతమయ్యాడని శ్రీకాంత్ ప్రశంసించాడు.