టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత విజయాల్లో జడ్డూ కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ ఏం చేశాడో (362 పరగులు, 15 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్), 2023 వరల్డ్‌కప్‌లో జడేజా కూడా అదే చేస్తాడని జోస్యం చెప్పాడు.
జడ్డూతో పాటు మరో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడ సత్తా చాటే అవకాశముందని తెలిపాడు. ఫార్మాట్లకతీతంగా జడేజా ఇటీవలికాలంలో తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను గెలిపించిన వైనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. భారత్ చివరిసారిగా గెలిచిన ఐసీసీ ట్రోఫీలోనూ (ఛాంపియన్స్ ట్రోఫీ 2013) జడేజా పాత్రనే కీలకమని గర్తు చేశాడు.
ప్రముఖ దినపత్రిక ఇండియాటుడేతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, జడేజా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (25 బంతుల్లో 33 నాటౌట్, 2/24) అదరగొట్టి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో జడ్డూ హైయ్యెస్ట్ వికెట్‌టేకర్‌గానూ (12 వికెట్లు) నిలిచాడు.
ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో రవీంద్ర జడేజా భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అతను.. ఐపీఎల్-2023లో సీఎస్‌కేను గెలిపించడంతో పాటు టీమిండియా విజయాల్లోనూ ప్రధానపాత్ర పోషించాడు. గాయం నుంచి కోలుకుని గతేడాది క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్ని ఫార్మాట్లలో జడేజా జోరు కొనసాగుతుంది. కెరీర్‌లో ఇప్పటివరకు 174 వవ్డేలు ఆడిన జడ్డూ.. 13 అర్ధశతకాల సాయంతో 32.80 సగటున 2526 పరుగులు చేశాడు. అలాగే 37.39 యావరేజ్‌తో 191 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment