Ind vs WI, 1st ODI: Rohit Sharma Loses His Cool, Abuses Shardul Thakur For Misfielding - Sakshi
Sakshi News home page

IND vs WI: మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్‌ సీరియస్‌! వీడియో వైరల్‌

Published Fri, Jul 28 2023 11:38 AM | Last Updated on Fri, Jul 28 2023 12:52 PM

Rohit Sharma Loses His Cool, Abuses Shardul Thakur  - Sakshi

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బార్బోడస్‌ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరేబియన్‌ జట్టు.. భారత స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, జడేజా ధాటికి కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.

కుల్దీప్‌ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3 వికెట్లు సాధించాడు. అనంతరం 115 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

శార్దూల్‌పై రోహిత్ సీరియస్‌..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు. సహాచర ఆటగాడు శార్ధూల్‌  ఠాకూర్‌పై రోహిత్‌ సీరియస్‌ అయ్యాడు. ఫీల్డింగ్‌లో శార్ధూల్‌ బద్దకంగా వ్యవహరించడంతో రోహిత్‌ కోపమయ్యాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో షాయ్‌ హోప్‌ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడాడు. 

అయితే షాట్‌లో పవ్‌ర్‌ లేకపోవడంతో బంతి బౌండరికి వెళ్లలేకపోయింది. అయితే కవర్స్‌లో ఉన్న శార్ధూల్‌ బంతిని అందుకోవడానికి నెమ్మదిగా వెళ్లాడు. ఈ క్రమంలో విండీస్‌తో బ్యాటర్లు 3 పరుగులు పూర్తి చేశారు. దీంతో శార్ధూల్‌ పేలవ ఫీల్డింగ్‌పై రోహిత్‌ ఆసహనం వ్యక్తం చేశాడు. అతడి వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిIND vs WI: కోహ్లి సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement