![Shardul Thakur conceded second most runs in an ODI innings by an Indian against the Proteas in South Africa - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/20/Shardul-Thakur.jpg.webp?itok=xcSgv7_g)
బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్‌తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాలో 72 పరుగులు శార్దూల్ సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో భారత బౌలర్‌గా ఠాకూర్ నిలిచాడు.
అంతకుముందు 2013లో మోహిత్ శర్మ 82 పరుగులతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాల్‌తో విఫలమైన ఠాకూర్ బ్యాట్‌తో అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఠాకూర్ అర్దసెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో ఠాకూర్‌కి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండి: SA vs IND: మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు!
Comments
Please login to add a commentAdd a comment