వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్, యుజువేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. అయితే ఈ మెగా టోర్నీ కోసం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై చాలా మంది భారత మాజీ క్రికెటర్‌లు పెదవివిరుస్తున్నారు.
ఈ జాబితాలో బీసీసీఐ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేరాడు. ఆల్‌రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకువడంపై శ్రీకాంత్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. శార్దూల్ ఠాకూర్ ఇంకా పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మారలేదని అతడు చెప్పుకొచ్చాడు.
అసలేందుకు ఎంపిక చేశారు?
"శార్దూల్ ఠాకూర్‌ను వరల్డ్‌కప్‌కు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. 8వ స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు కావాలని అందరూ అంటున్నారు. ఆ స్దానంలో అతడు వచ్చి 10 పరుగులు మాత్రమే చేస్తున్నాడు.
అది సరిపోతుందా? అలాగే 10 ఓవర్లు బౌలింగ్ కూడా చేయడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో మనం చూశాం. కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడు జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై చేసిన ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవద్దు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపై ప్రదర్శన చేస్తే ఒత్తడి ఎలా ఉంటుందో తెలుస్తోంది.
చిన్న జట్లపై ఆడింది వేరు వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో వేరు. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేముందు ఓవరాల్ సగటు కాకుండా వ్యక్తిగత ప్రదన్శనలను పరిగణలోకి తీసుకోవాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ఓ సారి పరిశీలించండి. అన్నివిధాలగా సమతుల్యతగా ఉందని స్టార్‌స్పోర్ట్స్ షోలో కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్.
చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్ విన్నర్ అరెస్టు!
Comments
Please login to add a commentAdd a comment