టీమిండియా (ఫైల్ ఫొటో)
Gautam Gambhir's Picks For India's ICC World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన జట్టును ఎంచుకున్నాడు. అనూహ్యంగా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్‌కు మాత్రం చోటివ్వని గౌతీ.. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే.
పుష్కరకాలం తర్వాత తొలిసారి
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీకి తెరలేవనుంది. సొంతగడ్డపై ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్ ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా.. టీమిండియాతో పాటు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ టైటిల్ వేటకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల తుది జట్ల కూర్పు ఎలా ఉండాలన్న అంశంపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
అయ్యర్‌తో పాటు వాళ్లకూ నో ఛాన్స్
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ 15 మంది సభ్యుల టీమిండియాను ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా.. శ్రేయస్ అయ్యర్‌ను విస్మరించిన గౌతీ.. ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కని వాషింగ్టన్ సుందర్‌కు స్థానం కల్పించాడు. అంతేకాదు.. సూర్యకుమార్ యాదవ్ తప్పక జట్టులో ఉండాలన్న ఈ కామెంటేటర్.. తిలక్ వర్మకు అవకాశం ఇవ్వలేదు.
ఇక సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా నాలుగో ఫాస్ట్‌బౌలర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను కాదని కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణకు టాప్-15లో చోటు కల్పించాడు.
గౌతీ జట్టుపై ఫ్యాన్స్ కామెంట్స్
దీంతో వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న అయ్యర్‌ను కాదని.. సూర్యకు చోటివ్వడం.. అలాగే పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించని కేఎల్ రాహుల్ కోసం సంజూను బలిచేయాలనడం సరికాదంటూ గౌతీ టీమ్‌పై టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ఏ ప్రాతిపదికన ఈ జట్టును ఎంపిక చేశాడో తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం గౌతం గంభీర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా?
Comments
Please login to add a commentAdd a comment