ప్రాక్టీస్‌లో టీమిండియా (PC: BCCI)
Asia Cup 2023 Ind vs Pak: ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థిపై గెలవాలనే పట్టుదలతో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ఆటగాళ్లు. ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
పెనాల్టీ షూటౌట్
ఇక ఆదివారం(సెప్టెంబరు 10) నాటి మ్యాచ్ కోసం గురవారం నుంచే నెట్ సెషన్ ఆరంభించిన టీమిండియా.. శుక్రవారం కూడా ప్రాక్టీసులో తలమునకలైంది. శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు.. పెనాల్టీ షూటౌట్‌తో సరదాగా గడిపారు.
అయ్యర్ గెలిచాడు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌తో కలిసి ఫుట్‌బాల్‌ను కిక్ చేస్తూ పోటీపడ్డారు. ఇందులో సూర్య, గిల్, శార్దూల్ ఓడిపోగా.. శ్రేయస్ అయ్యర్ మిడిల్ స్టంప్‌ను హిట్ చేయగా.. దిలీప్ తన్నిన బంతి మూడు స్టంప్స్‌ను తాకింది. దీంతో వాళ్లిదరిని ఎత్తుకుని విన్నర్స్ అంటూ సెలబ్రేట్ చేశారు మిగతా ఆటగాళ్లు.
పాక్‌తో ఆ మ్యాచ్ రద్దు.. ఈసారి
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘లక్ష్యం చేరుకోవడంలో అలసత్వం లేదు. ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మున్ముందుకు’’ అంటూ దీనికి #TeamIndia #AsiaCup హ్యాష్‌ట్యాగ్‌లతో క్యాప్షన్ జతచేసింది.
కాగా పాకిస్తాన్‌తో పల్లెకెలె మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్‌లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఈ క్రమంలో రోహిత్ సేన 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం తేలలేదు. ఇక మరి కొలంబోలో ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి!
చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment