ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన పాండ్యా.. మరికొన్ని మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
లిగమెంట్ టియర్(మోకాలి జాయింట్‌లో) కూడా ఉందనిపిస్తోంది. కాబట్టి కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమవుతుంది. గాయం పూర్తిగా తగ్గకముందు ఎన్సీఏ అతడిని ఆడేందుకు అస్సలు పంపించదు.
అయితే, వైద్య బృందం నిరంతరం పాండ్యాను పర్యవేక్షిస్తూ మేనేజ్‌మెంట్‌కు ఎప్పటికపుడు అప్‌డేట్ ఇస్తోంది. అతడు కోలుకునేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అతడు మైదానంలో దిగేలా కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది.
అయితే, పాండ్యా లీగ్ దశ ముగిసేనాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్న మేనేజ్‌మెంట్ అతడి స్థానాన్ని వేరే ప్లేయర్‌తో భర్తీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలిపింది. కాగా ప్రపంచకప్-2023లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రాణించడంతో పాటు కీలక వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ రాణించాడు. అయితే, మరో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నప్పటికీ పాండ్యా స్థానాన్ని అతడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవచ్చు.
చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్..
Comments
Please login to add a commentAdd a comment