ICC WC 2023- Ind Vs Eng: హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాడు జట్టుతో లేకపోవడం దురదృష్టకరమని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ రూపంలో తమకు మంచి ఆప్షన్ ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతడి స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
సూర్య ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు
ఇక హార్దిక్ చీలమండ గాయం మరింత తీవ్రమవడంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్ తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని పేర్కొన్నాడు.
తమదైన రోజు ఇంగ్లిష్ జట్టు పూర్తి ప్రమాదకారిగా మారుతుంది కాబట్టి పూర్తిస్థాయిలో తాము లక్నో మ్యాచ్‌కు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో పోరుకు హార్దిక్ లాంటి ముఖ్యమైన ప్లేయర్ లేకపోయినప్పటికీ.. సూర్య ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడనే నమ్మకం ఉందని రాహుల్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ డేంజరస్ టీమ్ కాబట్టి
ఈ మేరకు.. ‘‘హార్దిక్‌ను జట్టు మిస్ అవుతోంది. అయితే.. సూర్య నైపుణ్యాలు మా అందరికీ తెలుసు. అతడు మరోసారి తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చేంత వరకు సూర్యపై మేము నమ్మకం ఉంచాల్సిందే.
వరుస ఓటములు చవిచూస్తున్నా ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. వాళ్లు డేంజరస్ టీమ్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. కాబట్టి ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. లక్నో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే బాగుంటుంది.
దూకుడైన ఆటతో వరుస విజయాలు సాధిస్తున్నాం. ఇక ముందు కూడా దానిని కొనసాగించేలా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాం’’ అని కేఎల్ రాహుల్ జట్టు ఆట తీరు, భవిష్యత్ మ్యాచ్‌లకు తమ సన్నద్ధత గురించి చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటి వరకు ఐదుకు ఐదు గెలిచి టీమిండియా రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఐదింట ఒకటి మాత్రమే గెలిచి అట్టడుగున ఉంది.
చదవండి: WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment