టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్టేలు ఆడనుంది. ఈ క్రమంలో విండీస్‌తో తలపడే వన్డే, టీ20 భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. గతేఏడాది శ్రీలంకతో జరగిన వన్డేలో కుల్దీప్ చివరిసారిగా ఆడాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కుల్దీప్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా విండీస్‌తో సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయడం పట్ల భారత సెలెక్టర్లపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ కుల్దీప్ యాదవ్ సేవలను కచ్ఛితంగా కోల్పోయింది అని అతడు తెలిపాడు.
"భారత వన్డే జట్టులోకి కుల్దీప్ యాదవ్ పునరాగమనం చేయడం శుభపరిణామం. దక్షిణాఫ్రికాతో జరగిన వన్డేల్లో భారత్‌కు వికెట్ టేకింగ్ బౌలర్లు చాలా తక్కువ ఉన్నారు. జట్టులో అంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్లు లేరు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పేస్ లోపించినట్లు అనిపించింది. బహుశా అతను టెస్టు క్రికెట్ ఆడి కాస్త అలసిపోయి ఉండవచ్చు. కాగా పిచ్ నుంచి అతడికి సహాయం అందితే తప్ప బ్యాటర్లను ఇబ్బంది పెట్టే పేస్ శార్దూల్‌కి లేదు. ఇక భారత జట్టుకు కుల్దీప్ యాదవ్ చాలా మంచి ఆప్షన్. ఆఫ్-స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్, లెగ్గీగా రవి బిష్ణోయ్‌తో భారత స్పిన్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది" అని సల్మాన్ బట్ పేర్కొన్నాడు.
చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా!
Comments
Please login to add a commentAdd a comment