ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. అక్టోబర్ 31 రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి డెడ్ లైన్ అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.
రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిటైన్ లిస్ట్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీల బాటలోనే లక్నో సూపర్ జెయింట్స్ కూడా నడుస్తుంది. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటైన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఎల్‌ఎస్‌జీ ఈసారి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే రిటైన్ లిస్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ చాయిస్ కింద నికోలస్ పూరన్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పూరన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు కూడా కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదే కరెక్ట్ అయితే పూరన్‌కు పారితోషికం కింద రూ. 18 కోట్లు దక్కనున్నాయి.
ఎల్‌ఎస్‌జీ.. పూరన్‌తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్‌ను సెకెండ్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మయాంక్ యాదవ్‌కు రూ. 14 కోట్లు దక్కనున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ కేవలం 4 మ్యాచ్‌లే ఆడాడు. ఇందులో 7 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment