
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు.
అతడి భార్య తొలి బిడ్డకు జన్మనివ్వనుండడంతో రాహుల్ ఇంకా జట్టుతో చేరలేదు. రాహుల్ స్ధానంలో సమీర్ రిజ్వీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కేఎల్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్