
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి మనోహ్మన్ సింగ్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం ఓ సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై సమాలోచనలు చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలపై పార్టీ వైఖరిని ఈ కమిటీ వెల్లడిస్తోంది. ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ముఖ్యనేతలు పి. చిదంబరం, జైరాం రమేశ్, మనీశ్ తివారీ, ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, సోషల్ మీడియా ఇన్‌చార్జీ రోహన్ గుప్త తదితరులు సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై సమాలోచనలు చేయడంతో పాటు, నిర్మాణాత్మక సలహాలను ఈ బృందం ఇస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment