ముంబై: పార్లమెంట్లో జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగానే కాంగ్రెస్ ఓటేసిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆ విషయంలో మొండిగా, నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వ తీరునే తాము వ్యతిరేకించామన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనే కీలక నిర్ణయం తీసుకునే ముందు జమ్మూకశ్మీ ర్ ప్రజల విశ్వాసం చూరగొనాల్సిన అవసరం ఉం దని మన్మోహన్ పేర్కొన్నారు. దేశభక్తి విషయం లో కాంగ్రెస్‌కు ఎవ్వరి నుంచీ సర్టిఫికెట్ అక్కర్లేదన్నారు.రాజకీయ కక్ష సాధింపునకు ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్(ఈడీ) లాంటి సంస్థలను ఉపయోగిం చుకోవడం సరికాదని మన్మోహన్ వ్యాఖ్యానించా రు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోం దని మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పలుమార్లు ఆరోపిస్తు న్న నేపథ్యంలో మన్మోహన్ పై వ్యాఖ్యలు చేశారు.
పీఎస్‌యూలను పంచుకుంటున్నారు: రాహుల్
న్యూఢిల్లీ: సూటు బూటు మిత్రులతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్‌యూ) పంచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘బేచేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను తన సూటుబూటు స్నేహితులతో కలిసి పంచుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల శ్రమతో పీఎస్‌యూలు ఏర్పాటయ్యాయి’ అని గురువారం రాహుల్ ట్వీట్ చేశారు. హిందీ పదం ‘బేచ్‌నా’ అంటే అమ్మడం అని అర్థం. ఆ అర్థం స్ఫురించేలా బేచేంద్ర మోదీ అని రాహుల్ ప్రధాని మోదీని సంబోధించారు. పీఎస్‌యూల్లో పనిచేసే లక్షలాది ఉద్యోగుల పరిస్థితి అనిశ్చితిలో ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.
370 రద్దుకు కాంగ్రెస్ అనుకూలమే
Published Fri, Oct 18 2019 3:46 AM | Last Updated on Fri, Oct 18 2019 4:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment