
భారత ప్రధాని (2004–2014) మన్మోహన్ సింగ్‌ను ‘ది అండర్‌అచీవర్’గా ‘టైమ్’ మ్యాగజీన్ తన ముఖచిత్ర కథనంలో అభివర్ణించింది. దేశ ఆర్థిక సంస్కరణల విషయమై సింగ్ అనుకున్నంతగా ఏమీ సాధించలేకపోయారని రాసింది. ‘ది అండర్‌అచీవర్ : ఇండియా నీడ్స్ రీబూట్’ (తక్కువ సాధించిన వ్యక్తి : పునరుత్తేజ అవసరంలో ఇండియా) అనే శీర్షికతో వచ్చిన ఈ కథనం భారతదేశ రాజకీయాల్లో కలకలం రేపింది.
ధ్వని లేని గుంభనత్వంతో కూడిన సింగ్ ఆత్మవిశ్వాసపు వెలుగు క్షీణించడం మొదలైందని, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు దేశ పురోగమనం కోసం ఆయనే ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణల నుంచి సింగ్ దూరం అవుతున్నారంటే, ప్రధానిగా ఆయన తన నిష్క్రియాశీలతతో సొంత మంత్రివర్గ సభ్యుల మీదే నియంత్రణ కోల్పోయారని స్పష్టం అవుతోందని ‘టైమ్’ సుదీర్ఘ కథనాన్ని అందించింది. దీనిపై మన్మోహన్ సింగ్ గానీ, కాంగ్రెస్ గానీ బహిరంగంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. ప్రతిపక్షాలు మాత్రం టైమ్ కథనాన్ని ఒక ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేశాయి.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
- అజ్మల్ కసబ్‌కు ఉరి (నవంబర్ 21)
- భారత్‌లోని అజ్మీర్ షరిఫ్ దర్గా సందర్శనకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ వ్యక్తిగత పర్యటన.
- 5000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని–5 ను ప్రయోగించిన భారత్.
- భారత పార్లమెంట్ 60వ వార్షికోత్సవం.
- భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ.
- దారాసింగ్, రాజేశ్ ఖన్నా, వర్ఘీస్ కురియన్, యశ్ చోప్రా, బాల్ థాక్రే, ఐ.కె.గుజ్రాల్, రవిశంకర్.. కన్నమూత.
(చదవండి: చైతన్య భారతి: ‘గాంధీ’కి ఆస్కార్ డిజైనర్ భాను అథియా)
Comments
Please login to add a commentAdd a comment