మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ! | Former Prime Minister Manmohan Singh Celebrated 87th Birthday | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!

Published Thu, Sep 26 2019 3:26 PM | Last Updated on Thu, Sep 26 2019 5:05 PM

Former Prime Minister Manmohan Singh Celebrated 87th Birthday  - Sakshi

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్‌ సింగ్‌ గురువారం (సెప్టెంబరు 26) తన 87వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో సహా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌. అమరిందర్‌ సింగ్‌, శరద్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. 'మన్మోహన్‌ సింగ్‌ జీ పుట్టినరోజు సందర్భంగా దేశ నిర్మాణానికి ఆయన అందించిన నిస్వార్థ సేవ, అంకితభావం, సహకారాలను గుర్తుచేసుకుందాం' అని రాహుల్ గాంధీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. 

అంతేకాక మన్మోహన్‌ సాధించిన విజయాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఒక వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో మన్మోహన్‌ను 'దూరదృష్టి గల ఆర్థికవేత్త' గా అభివర్ణించింది. తన బాల్యం పంజాబ్‌లో గడిచిన తీరు, అతను 'కిరోసిన్ దీపం కింద' చదువుకొని, జీవితంలో ఎదిగిన తీరును గుర్తు చేశారు. అంతేకాక 1991లో ఆర్థిక వ్యవస్థ సరళీకరించడంతో పాటు 2008లో చంద్రయాన్-1ను ప్రారంభించిన ఘనత మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌ మాధ్యమంగా మన్మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయూరారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా మన్మోహన్‌ సింగ్‌కు తన అభినందనలు తెలిపారు. 

As we celebrate Former PM Dr. Manmohan Singh, we look back at some of his greatest achievements. He has served our country for several decades & continues to do so with his renowned intelligence, humility & dedication. #HappyBirthdayDrSingh pic.twitter.com/AmRe39fc8s


భారతదేశ భవిష్యత్తుపై తనకంటూ ఓ ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గురించి కొన్ని విషయాలు:

  • 1991- 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా, 2004-14లో ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితాన్నిరెండు కాలాలుగా విభజించవచ్చు. తన పదేళ్ల పదవీకాలంలో బైపాస్ సర్జరీ (2009) చేయించుకున్నప్పుడు తప్ప.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. 
  • అంతేకాక ప్రధానిగా ఉన్న సమయంలో రోజుకు 18 గంటలు పని చేసి, రోజుకు సగటున 300 ఫైళ్లు క్లియర్ చేసేవారు.
  •  జనవరి 2014లో మన్మోహన్ సింగ్‌పై మీడియా, బీజేపీ పార్టీ, ప్రత్యర్థి రాజకీయ నాయకులు.. ఆయన నాయకత్వం బలహీనంగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. తాను బలహీనమైన ప్రధాని ఏమాత్రం కానని.. సమకాలీన మీడియా కంటే చరిత్ర తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వచ్చినా.. తాను మాత్రం ప్రధానిగా మూడవసారి కొనసాగబోనని ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కాగా 2014 మేలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement