న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజ్యసభ ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఆయన ప్రశంసల జల్లు గుప్పించారు.
ఆర్థిక సంస్కరణలకుగానూ దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉందని గడ్కరీ మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలోని పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరం. 1991లో ఆర్థిక మంత్రిగా మనోహ్మన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు.. ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికి మన దేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయి. సరళీకరణతో కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్‌కు ఈ దేశం రుణపడి ఉంది అని గడ్కరీ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగానే 1990ల మధ్యకాలంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడానికి డబ్బును సేకరించగలిగానని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందని, అందుకు చైనా మంచి ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్‌కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’
Comments
Please login to add a commentAdd a comment