సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్‌పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్‌పీజీకి బదులు ఆయనకు సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాల సమచారాన్ని విశ్లేషించి హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌పీజీ భద్రతను కొద్దిమందికే కల్పించనున్న క్రమంలో వార్షిక సమీక్షలో భాగంగా మన్మోహన్ సింగ్ భద్రతను పునఃసమీక్షిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
. ఎస్‌పీజీ భద్రత ప్రస్తుతం కేవలం నలుగురు అత్యున్నత రాజకీయ ప్రముఖులైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది. మన్మోహన్ సింగ్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 3000 మందికి పైగా సిబ్బందితో కూడిన ఎస్‌పీజీ భద్రతను దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్న ముప్పు ఆధారంగా ప్రత్యేక దళంతో భద్రత కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment