
ఖర్గే మోదీకంటే సీనియర్.. అవమానించడం తగదు: ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరిచారని, అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు.
అంతేగాక మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందింస్తూ ఖర్గేకు కౌంటర్ లేక రాయడంపై ఆమె మండిపడ్డారు. ‘ఖర్గే ప్రధానమంత్రి కంటే పెద్దవారు. ఆయన్ను మోదీ ఎందుకు అగౌరపరిచారు? ప్రధాని మోదీకి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలపై గౌరవం ఉంటే ఆయనే స్వయంగా ఖర్గే ఈ లేఖకు సమాధానమిచ్చేవారు. కానీ అలాకాకుండా నడ్డా ద్వారా ఆయన లేఖ రాయించారు. అందులోనూ ఖర్గేను అవమానపరిచారు. 82 ఏళ్ల సీనియర్ నాయకుడిని అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది?
ప్రశ్నించడం, సమాధానాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగం. గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదని మతం కూడా చెబుతోంది. నేటి రాజకీయాలు విషపూరితంగా మారాయి. అయితే ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకొని దీనికి భిన్నమైన ఉదాహరణను చూపాలి. ప్రధాని తమ పదవికి ఉన్న స్థాయిని దృష్టిలోపెట్టుకొని సీనియర్ నాయకుడికి సమాధానం ఇచ్చి ఉంటే ఆయనకు విలువ ఉండేది. ఆయనపై గౌరవం పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరం’ అని ప్రియాంక మండిపడ్డారు.
కాగా ఇటీవల బీజేపీ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మోదీకి ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాశారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా అభివర్ణించారు.
గతంలో రాహుల్ ప్రధానిని ఇదేవిధంగా అవమానపరచలేదా? అని ప్రశ్నించారు. ‘మోదీపై సోనియాగాంధీ ‘మృత్యుబేహారీ’ అని అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ రాజకీయ నైతికతను మరిచిపోయిందా? గత ఐదేళ్లలో ప్రధానిని మీ నేతలు 110 సార్లు అవమానించారు. ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు.
कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।
प्रधानमंत्री जी की…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024