rajyasaba seat
-
సోనియా లేదా ప్రియాంకకు.. నడ్డా రాజ్యసభ సీటు !
షిమ్లా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. ఈ సీటు సోనియాగాంధీ లేదా ప్రియాంక గాంధీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్ తెలిపారు. సోనియా, ప్రియాంకలకు ఆసక్తి ఉంటే ఈ సీటుకు వారి పేర్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు కూడా ఎన్నిక జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లకుగాను 40 సీట్లతో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉండటంతో ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కనుంది. వచ్చే నెల హిమాచల్‌ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సమయంలో ఈ సీటుకు ఎన్నిక జరగనుంది. 2018లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3 రాజ్యసభ సీట్లుండగా మూడు ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇదీచదవండి.. ఇండియాకు తొలి ఓటమి.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ -
బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్
గాంధీనగర్: బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గుజరాత్ (3), బెంగాల్ (6), గోవా (1) రాష్ట్రాల్లో కలిపి మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లకు జూలై 13వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుజరాత్లో మూడు స్థానాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో ఒక స్థానం నుంచి ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్‌కు సీటు ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తూ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, జయశంకర్ రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు అధికారికంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక, మిగిలిన రెండు సీట్లలో అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతదేశంలో కీలకంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించింది. కాగా, సౌత్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా తెలుగు నేతలకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. త్వరలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. The Bharatiya Janata Party (#BJP) is close to finalizing its candidate for the upcoming Rajya Sabha election. Foreign Minister S. Jaishankar is the frontrunner for one of the three #seats. Tomorrow, #Jaishankar will officially submit his #nomination in Gujarat. pic.twitter.com/CzDTwiTmSF — Our Vadodara (@ourvadodara) July 9, 2023 ఇది కూడా చదవండి: జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం -
అదానీకి రాజ్యసభ సీటు?.. క్లారిటీ ఇచ్చిన సంస్థ
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. రాజకీయాల్లోకి రానున్నారా..? ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నారా..? దీనిపై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అదానీ సంస్థ తరఫున ఓ ప్రకటన విడులైంది. ఏపీ నుంచి గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది. గౌతమ్ అదానీకి గానీ, అతడి భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం అదాని సంస్థ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అదానీ ఫ్యామిలీలో ఎవరికీ రాజకీయాల మీద ఆసక్తి లేదని, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సంస్థ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫేక్ వార్తలకు అదాని చెక్ పెట్టారు. Media Statement on false news about Rajya Sabha Seat pic.twitter.com/GK4y3uIWGL — Adani Group (@AdaniOnline) May 14, 2022 -
'సీఎం నాకు అవకాశం ఇస్తానన్నారు'
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే తనకు అవకాశం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి పుష్పరాజ్ చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబుతో మంత్రి పుష్పరాజ్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హామీపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభ అభ్యర్థిగా మాజీ మంత్రి పుష్పరాజ్ పేరు వినిపించిన నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే ఆ సీటు దాదాపు ఆయనకే ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, ఏపీ టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థి కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.