Foreign Minister Jaishankar Will File His Rajya Sabha Nomination In Gandhinagar - Sakshi
Sakshi News home page

S Jaishankar: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్‌

Published Sun, Jul 9 2023 3:17 PM | Last Updated on Sun, Jul 9 2023 3:43 PM

Foreign Minister Jaishankar Will File His Rajya Sabha Nomination In Gandhinagar - Sakshi

గాంధీనగర్‌: బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గుజరాత్ (3), బెంగాల్ (6), గోవా (1) రాష్ట్రాల్లో కలిపి మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లకు జూలై 13వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుజరాత్‌లో మూడు స్థానాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 

గుజరాత్‌లో ఒక స్థానం నుంచి ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌కు సీటు ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తూ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, జయశంకర్‌ రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు అధికారికంగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇక, మిగిలిన రెండు సీట్లలో అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతదేశంలో కీలకంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించింది. కాగా, సౌత్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా తెలుగు నేతలకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. త్వరలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement