విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే తనకు అవకాశం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి పుష్పరాజ్ చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబుతో మంత్రి పుష్పరాజ్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హామీపై హర్షం వ్యక్తం చేశారు.
అయితే రాజ్యసభ అభ్యర్థిగా మాజీ మంత్రి పుష్పరాజ్ పేరు వినిపించిన నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే ఆ సీటు దాదాపు ఆయనకే ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, ఏపీ టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థి కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
'సీఎం నాకు అవకాశం ఇస్తానన్నారు'
Published Mon, May 30 2016 6:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement