rajyasaba elections
-
నామినేషన్ సమర్పించిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర న్యాయ, సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అరుణ్‌జైట్లీ ఉత్తర ప్రదేశ్ నుంచి, రవిశంకర్ ప్రసాద్ తన సొంత రాష్ట్రం బిహార్ నుంబి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. రెండు రోజుల క్రితమే పార్టీ అభ్యర్థుల పేర్లును ప్రకటించడంతో మంత్రులు ఇవాళ నామినేషన్లు వేశారు. కాగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ నామినేషన్ వేయడానికి బయలుదేరే ముందు తల్లి ఆశీర్వాదాలు అందుకుని ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. Took the blessings of my mother again before going to file my nomination for Rajya Sabha, today. The love of my 86 year old mother Mrs Bimla Prasad is my biggest strength. May God give her a long and healthy life. pic.twitter.com/uTg1oAvRRn — Ravi Shankar Prasad (@rsprasad) 12 March 2018 గాంధీనగర్: గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ యామీ యాజ్నిక్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన నామినేషన్‌కు అధిష్టానం నుంచి రెండు రోజుల క్రితమే గ్రీన్‌సిగ్నల్ రావడంతో నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్: కేంద్ర పెట్రోలియం, సహజ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి సోమవారం నాడు భోపాల్‌లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మరో కొన్ని రోజుల్లో తన రాజ్యసభ పదవికాలం ముగియనుండడంతో మంత్రి మరోసారి రాజ్యసభకు ఎన్నికకానున్నారు. కాగా రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మేజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకే. ముంబాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మహారాష్ట్ర సీనియర్ జర్నలిస్ట్ కుమార్ ఖేత్కర్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన కుమార్‌కు రాహుల్ గాంధీ అవకాశం కల్పించారు. ఖేత్కర్ మొదటి సారి చట్ట సభలో అడుగుపెట్టనున్నారు. -
సీఎం రమేష్, కనకమేడల నామినేషన్లు
అమరావతి: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్ పదవీకాలం ఈ నెలలో ముగియనుంది. ఇక కనకమేడల రవీంద్ర గతంలో టీడీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడిగా.. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన పేరు చివరి నిమిషంలో ఖరారైంది. -
కంగుతిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు
విజయవాడ: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో ఘోర అవమానం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫోన్ల అనుమతిని నిరాకరించారు. సెక్యూరిటీ వద్దే ఎమ్మెల్యేల ఫోన్లను వదిలిపెట్టి రావాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ఫోన్లను పోలీసులు తీసుకోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతేకాక సమావేశంలోనూ ఆ ఎమ్మెల్యేలను మధ్యలో వదిలేసి చంద్రబాబు వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందంటూ వ్యక్తిగత రూమ్‌లోకి చంద్రబాబు వెళ్లారు. ఇదిలా ఉండగా, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థి ఖరారుపై నేతలతో మంతనాలు జరుపుతున్న చంద్రబాబు కోసం గంటల తరబడి ఎమ్మెల్యేలంతా ఎదురుచూడక తప్పలేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను పదేపదే సమావేశాలంటూ చంద్రబాబు.. తిరుపతి నుంచి విజయవాడ.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిప్పుతుండటంతో ఆ ఎమ్మెల్యేలంతా ఒకింత అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. -
'సీఎం నాకు అవకాశం ఇస్తానన్నారు'
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే తనకు అవకాశం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి పుష్పరాజ్ చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబుతో మంత్రి పుష్పరాజ్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హామీపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభ అభ్యర్థిగా మాజీ మంత్రి పుష్పరాజ్ పేరు వినిపించిన నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే ఆ సీటు దాదాపు ఆయనకే ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, ఏపీ టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థి కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.