కంగుతిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు | disqualified mlas upset with chandrababu naidu's activities | Sakshi
Sakshi News home page

కంగుతిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Published Mon, May 30 2016 9:34 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

కంగుతిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు - Sakshi

కంగుతిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు

విజయవాడ: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో ఘోర అవమానం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫోన్ల అనుమతిని నిరాకరించారు. సెక్యూరిటీ వద్దే ఎమ్మెల్యేల ఫోన్లను వదిలిపెట్టి రావాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ఫోన్లను పోలీసులు తీసుకోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతేకాక సమావేశంలోనూ ఆ ఎమ్మెల్యేలను మధ్యలో వదిలేసి చంద్రబాబు వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చిందంటూ వ్యక్తిగత రూమ్‌లోకి చంద్రబాబు వెళ్లారు.

ఇదిలా ఉండగా, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థి ఖరారుపై నేతలతో మంతనాలు జరుపుతున్న చంద్రబాబు కోసం గంటల తరబడి ఎమ్మెల్యేలంతా ఎదురుచూడక తప్పలేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను పదేపదే సమావేశాలంటూ చంద్రబాబు..  తిరుపతి నుంచి విజయవాడ.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిప్పుతుండటంతో ఆ ఎమ్మెల్యేలంతా ఒకింత అసహనానికి గురైనట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement