ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం తలపెట్టింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇంఛార్జ్‌లతో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ సమావేశం కానున్నారు.
కాగా, ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరుగనుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వరకు రెండు దఫాలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. మొదట జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనుంది.
ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలోనే మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి నేతలు.. ఒక నివేదిక రూపంలో సమర్పించనున్నారు. ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలో రాజకీయ పరిస్థితులపై ప్రత్యకంగా చర్చించనున్నట్టు సమాచారం. ఎన్నికల వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు బీజేపీ పెద్దలు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. హైఓల్టేజ్ పాలిటిక్స్
Comments
Please login to add a commentAdd a comment