బీజేపీ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా ఎంపికైనట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ జాతీయ అద్యక్షుడి పదవిలోనూ కొంతకాలం పాటు ఆయన కొనసాగనున్నారు. కాగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితోపాటు రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.
2020లో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ దక్కడంతో నడ్డా.. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన రాజీనామా చేయలేదు. బీజేపీ అగ్ర సంస్థాగత నేతగా కొనసాగుతున్నారు.
అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇది జరగడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. కాబట్టి కొత్త అధ్యక్షుడిని డిసెంబర్-జనవరిలో జరగవచ్చు.
ఇక న్యాయశాస్త్రంలో పట్టా పొందిన నడ్డా, ABVP కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1991లో పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా ఎదిగారు. 2012లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఎంపికయ్యారు.
గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు; బిలాస్‌పూర్ నుంచి మూడుసార్లు (1993, 1998, 2007) గెలుపొందారు. 1998 -2003 మధ్య ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment