
న్యూఢిల్లీ: అమెరికా ఈజిప్టు పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధానమంత్రి దేశంలో ఏం జరుగుతోందని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఘాటుగా స్పందించారు. దేశంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మధ్యప్రదేశ్ కాదు ముందు మణిపూర్ వెళ్ళమని సలహా ఇచ్చారు.
దేశం సుభిక్షంగా ఉంది..
ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతించిన జేపీ నడ్డా సహా బీజేపీ శ్రేణులను ఆయన దేశం గురించి కుశలమడిగే ప్రయత్నంలో దేశంలో ఏం జరుగుతోందని అడిగారు. ప్రధాని ప్రశ్నకు బదులిస్తూ దేశంలో తొమ్మిదేళ్లుగా అభివృద్ధి గురించి ప్రజలకు కార్యకర్తలు నివేదిక సమర్పిస్తున్నారని.. దేశమంతా సంతోషంగానే ఉందని జేపీ నడ్డా తెలిపారు.
మధ్యప్రదేశ్ కాదు మణిపూర్ వెళ్ళండి..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాత్రం ప్రధాన మంత్రి అడిగిన ప్రశ్నకు ఒక వీడియో ద్వారా స్పందిస్తూ.. దేశంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి బదులుగా మణిపూర్ వెళ్లి చూడండి. ఆ రాష్ట్రం రావణకాష్టంలా మారి తగలబడిపోతోంది. ఇక బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదానికి ముస్లింలను బాధ్యులను చేస్తూ మీ ఐటీ బృందం తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. యూఎస్ ప్రెస్ కాన్ఫరెన్సులో మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడిగినందుకు పాపం జర్నలిస్టు సబ్రినా సిద్ధిఖీని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్న మీ ప్రధాన కార్యకర్తలపై వైట్ హౌస్ వర్గాలు మండిపడుతున్నాయని అన్నారు.
प्रधान मंत्री जी आप जानना चाहते हैं ना कि ‘इंडिया में क्या चल रहा है’।
तो प्रधान मंत्री जी, समझ लीजिए कि ‘इंडिया में फ़ौग चल रहा है…..’ pic.twitter.com/uT1QhlHViR
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 27, 2023
ఇది కూడా చదవండి: ఎయిరిండియా నడి విమానంలో మలమూత్రవిసర్జన.. అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment