
ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికలు ఒకవైపు వారసత్వ రాజకీయాలు, అవినీతికి, మరోవైపు అభివృద్ధికి మధ్య పోరుకు వేదికగా మారనున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ముంబైలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో నడ్డా మాట్లాడారు.
ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలు, అవినీతితో కూరుకుపోయి ఉన్నాయని విమర్శించారు. ఇటువంటి పార్టీలతో జరిగేది వినాశనమేనని హెచ్చరించారు.