‘రాజవంశ పాలనే నమ్ముతున్నారు’.. రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగిన నడ్డా | JP Nadda says Rahul Gandhi believes in dynastic rule | Sakshi
Sakshi News home page

రాజవంశ పాలనే నమ్ముతున్నారు.. రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగిన నడ్డా

Published Fri, Apr 19 2024 3:27 PM | Last Updated on Fri, Apr 19 2024 4:13 PM

JP Nadda says Rahul Gandhi believes in dynastic rule - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత,కేరళ వయనాడ్‌ లోక్‌సభ అభ్యర్ధి రాహుల్‌ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. రాహుల్‌ గాంధీ ఇంకా  రాజవంశ పాలనను విశ్వసిస్తున్నారని విమర్శించారు. వయనాడ్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి కే సురేంద్రన్‌కు మద్దతుగా జేపీ నడ్డా కేరళ సుల్తాన్‌ బేతరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో నడ్డా రాహుల్‌ గాంధీ ఇంకా రాజవంశ పాలను నమ్ముతున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజస్వామ్య పాలన ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారని తెలిపారు. విభజించు పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఆచరిస్తున్నారని ఆరోపించారు .

నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)అనుసంధానమైన రాజకీయ పార్టీ సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడంపై మండిపడ్డారు. 

సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌డీపీఐ కాంగ్రెస్‌కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇస్తోందని, ఈ రెండు పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం) రెండూ సైద్ధాంతికంగా దివాళా తీశాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement