తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: ప్రధాని మోదీ | PM Narendra Modi Nagarkurnool Tour Live Updates | Sakshi
Sakshi News home page

బీజేపీ విజయసంకల్ప సభ: నాగర్‌కర్నూల్‌లో ‍ప్రధాని మోదీ.. అప్‌డేట్స్‌

Published Sat, Mar 16 2024 10:58 AM | Last Updated on Sat, Mar 16 2024 12:52 PM

PM Narendra Modi Nagarkurnool Tour Live Updates - Sakshi

Live Updates..

బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రసంగం... 

తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోదీ

  • గత పదేళ్ల తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి​ చేసింది
  • తెలంగాణ ప్రజల కలలను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ధ్వంసం చేశాయి
  • మల్కాజ్‌గిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను
  • వేగవంతమైన అభివృద్ధి కూడా తెలంగాణలో తీసుకురావాలి
  • కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి 
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది
  • తెలంగాణను గేట్‌వే ఆఫ్‌ సౌత్‌ అంటారు
  • ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్‌ ఏం చేయలేదు
  • తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి
  • 140 కోట్ల మంది భారతీయులు  నా కుటుంబం
  • ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు రాబోతున్నాయి
  • గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్‌వాళ్లు​ ఇచ్చారు. కానీ, పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు.
  • 87 లక్షల మంది ఆయుష్మాన్‌ భారత్‌ కింద లబ్ది పొందారు 
  • అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే
  • దళిత బంధు పేరుతో బీఆర్‌ఎస్‌ దళితులను మోసం చేసింది
  • కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది
  • ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశాం
  • రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు
  • బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ అడుగు జాడల్లోనే నడుస్తోంది
     

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లి లిక్కర్‌ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్‌ కుటుంబానిది. కేసీఆర్‌ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోంది. గ్యారెంటీల పేరతో కాంగ్రెస్‌ గారడీలు చేస్తోంది. నేడు యువత, ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్‌ వ్యాపారం చేసి దోచుకున్నారు. 

నాగర్‌ కర్నూల్‌ చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొననున్న మోదీ. 

బేగంపేట్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. 

కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 

శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. 

అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్ కర్నూల్‌కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. 

ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement