సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మాణం పనులు 1988– 89లో ప్రారంభయ్యాయి. కేంద్రంలో తొలిసారిగా 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఒక్కో యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కాగా, మొత్తం 6 యూనిట్లను మూడేళ్లలో పూర్తి చేశారు. ఒక్క యూనిట్‌కు 150 మెగావాట్ల చొప్పు న విద్యుత్ కేంద్రం మొత్తం 900 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. గత నెల 17వ తేదీ నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జెన్‌కో యాజమాన్యం భూగర్భ కేంద్రానికి ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,400 మిలియన్ యూని ట్లు ఇవ్వగా.. కేవలం 31 రోజుల్లోనే 600 మిలి యన్ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు సమాచారం. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు యూనిట్లకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద నష్టం రూ.వేల కోట్లలో ఉండొచ్చని సమాచారం. ఘటనపై ప్రభుత్వం సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడతాయనే విషయాన్ని అధికారులు వెల్లడించడంలేదు. నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలు, నష్టంపై ఓ అంచనాకు రావచ్చని చెబుతున్నారు. (మృత్యుసొరంగం)
విద్యుత్ సరఫరాలో అంతరాయం..
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 870 అడుగులకు తగ్గకుండా ఉన్నంత వరకే కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దాదాపు వచ్చే ఏడాది ఫిబ్ర వరి వరకు నీరు ఉండే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రమాదం జరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంటే రోజుకు 21 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రమాదం కారణంగా 1,400 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యా న్ని చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్పత్తి కోల్పోవడం వల్ల పవర్‌గ్రిడ్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మరో మార్గంలో గ్రిడ్ సమకూర్చుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రా నికి జల విద్యుత్ కేంద్రం ద్వారా అందించే 900 మెగావాట్ల విద్యుత్ కోల్పోయింది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మరణించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఈ మరణాలు తమను ఎంతగానో బాధించాయని వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించింది. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాల గురించే ఆలోచిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ప్రధాని స్పందిస్తూ ‘అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరం. నా మనసంతా మృతుల కుటుంబాల చుట్టూనే తిరుగుతోంది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’అని ట్వీట్ చేశారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయంతో పాటు ఇతర సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు బాధిత కుటుంబాలకు శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment