సాక్షి, అచ్చంపేట: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విభాగాల వారీగా ఓటర్ల సంఖ్యను బట్టి హామీలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబరు 9తో ముగిసింది.
దీంతో అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఇందులో వయస్సుల వారీగా ఓటర్ల వివరాలను సైతం పొందుపరిచారు. అధికారులు ప్రకటించిన జాబితాలో యువ ఓటర్ల సంఖ్య ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళిలు
మూడు నియోజకవర్గాల్లో యువకులు గణనీయంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. 18–29 మధ్య వయ స్సు వారు 1,66,496మంది ఉన్నారు. నాగ ర్‌కర్నూల్ నియోజకవర్గంలో 54,361, అచ్చంపేటలో 57,572, కొల్లాపూర్‌లో 54,563మంది యువ ఓటర్లు ఈసారి ప్రభావం చూపనున్నా రు. వీరితో పాటు 30నుంచి 39ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ ఎన్నికల్లో వీరందరూ కీలకంగా మారనున్నారు. అభివృద్ధి, పరిపాలన తీరు, అభ్యర్థి పనితీరును బట్టి సమగ్రంగా ఆలోచించి ఓటువేసే ఓటర్లు కావడంతో పార్టీల అభ్యర్థులు వీరిని ఆకట్టుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు చేసుకుంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో మధ్య వయస్సు ఓటర్లు తీసుకునే నిర్ణయంపైనే అభ్యర్థుల విజయం ఆధారపడి ఉంటుందనేది పలు సర్వేలో తేలింది. యువ ఓటర్లతో పోటీగా వీరి ఓట్లను కొల్లగొట్టేవారిని విజయం వరిస్తుంది.
మొదటిసారి ఓటు వేసేవారు 26,039
గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య నమోదు శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో కొత్తగా 26,039 మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న యువకులకు అధికారులు ఓటు హక్కును కల్పించారు. వీరిలో అమ్మాయిలు 12,022మంది, అబ్బాయిలు 14,022మంది ఉన్నారు.
వీరంతా మొదటిసారిగా ఓటు వినియోగించుకోనున్నారు. కొత్త ఓటర్ల నమోదు మూడు నియోజకవర్గాల్లో ఆశాజనకంగానే సాగింది. ఈ జాబితాలో నాగర్‌కర్నూల్ 12,782 మందితో మొదటి స్థానంలో, అచ్చంపేట 9,328 మందితో రెండవ స్థానంలో, కొల్లాపూర్ 3,923మందితో మూడో స్థానంలో ఉంది.
పార్టీల యువమంత్రం
జిల్లాలో అధికశాతం గ్రామీణ ప్రాంతాలు కావడంతో పోలింగ్ శాతం 70శాతానికి పైగానే ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతా ల్లో ఈ సమస్య లేదు. ఓటు హక్కును వినియో గించుకునే వారిలో యువకులు అధికంగా ఉండటం మరో విశేషం. దీంతో అన్ని పార్టీలు యుక ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment