
సాక్షి, నాగర్‌కర్నూల్: గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూలు పోలీస్‌స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. బిజినపల్లి మండలానికి చెందిన నిజామ్..తన భార్య కాపురానికి రావడం లేదని నాగర్‌కర్నూలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. అయితే బిజినపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. పోలీసులు చెప్పినా వినకుండా.. మద్యం మత్తులో ఉన్నఆ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. బాధితుడిని పోలీసులు నాగర్‌కర్నూలు జిల్లా ఆసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment