
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్టువర్లపల్లి సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది. ఒక్కసారిగా పులి రో డ్డుపైకి రావడంతో అటు వెళ్తున్న ప్ర యాణికులు వాహనాలను నిలిపివేశారు. పులి ఫొటోలను కెమెరాల్లో చిత్రీకరించారు.
దీనిపై డీఎఫ్‌వో రోహిత్ గోపిడి స్పందిస్తూ అమ్రాబా ద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు. అందుకే మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు అక్కడక్కడ రోడ్డుపై పులుల సంచారం కనిపిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment