
జైపాల్‌నాయక్, మునావత్ నాన్కు
కల్వకుర్తి టౌన్: కరోనాతో కొడుకు మృతి చెందిన కొన్ని గంటల్లోనే తల్లి హఠాన్మరణం చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవల్లితండాకు చెందిన జైపాల్‌నాయక్(55) ప్రస్తుతం జూపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. గత నెల 28న జైపాల్‌నాయక్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి మునావత్ నాన్కు(80) కొంతసేపటికే గుండె పోటుతో చనిపోయింది. కాగా ఆమె దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేదని తండావాసులు తెలిపారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment